శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (17:22 IST)

హైదరాబాద్ శివార్లలో మరో దిశ.. అత్యాచారం ఆపై హత్య జరిగిందా?

హైదరాబాద్ నగర శివార్లలో దిశ లాంటి ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని పాతబస్తీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణం హత్యకు గురైంది. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు వద్ద ఓ మహిళ దారుణంగా హత్య గురైంది. హత్య చేయబడ్డ మహిళ మొహంపై బండరాయితో బలంగా మోదీ హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. 
 
హత్యకు గురైన మహిళ దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో... ఎవరో గుర్తు తెలియని దుండగులు మహిళను నమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అని భావిస్తున్నారు పోలీసులు. సంఘటన స్థలంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఆధారాలను సేకరించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.