పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేని పవన్.. ఇక్కడేం చేస్తాండు..? బాల్క సుమన్
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట గెలువలేదని.. పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్‌లో రాజకీయాలు ఎంటో వాళ్ళకే తెలియాలని కౌంటర్ వేశారు.
పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదం. ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడు. అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడంవిడ్డూరం. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు..?. విస్తృత ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంట.. ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారు' అంటూ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అన్ని పథకాలు మావే అన్న కేంద్రం... 30 ఏండ్ల లోపు కేంద్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఆ హోదాలో హుందాగా ఉండాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్- గుజరాత్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకొని దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ ప్రశాంతంగా ఉంటే.. ప్రతిపక్షాల్లో సొంతపార్టీ నేతల విమర్శలతో గందరగోళం ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన టికెట్లలో 50 శాతంకి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారని.. ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షోలా అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.