మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (15:29 IST)

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బండి సంజయ్

తెలంగాణ పోలీసులు తనపై మోపిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నెల 2వ తేదీన కరీనంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాగరణ దీక్షను చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఆయన ఈ దీక్షకు దిగారు. 
 
అయితే, బండి సంజయ్ కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరుచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బండి సంజయ్‌ను హుజురాబాద్ శాసన సభ్యుడు, బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు.