బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (08:03 IST)

టీఆరెస్ ప్రభుత్వంలో ప్రతీ స్కీం వెనుక ఒక స్కాం

టీఆరెస్ ప్రభుత్వంలో ప్రతీ పథకం వెనుక ఏదో ఓ కుంభకోణం ఉంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఈఎస్ఐలో జరిగిన భారీ స్కాం విషయంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

హుజూర్నగర్లో భాజపా జెండా ఎగరేవేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. ప్రతీ పథకం వెనుక ఒక స్కామ్‌ ఉందని ధ్వజమెత్తారు. ఈఎస్‌ఐలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఈఎస్ఐ స్కామ్‌లో ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మందులను అధికారులు ప్రభుత్వ పెద్దలు అడ్డంగా మింగేశారన్నారు. నిందితులను తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. నిజామాబాద్ రైతుల్లాగే హుజూర్నగర్‌ రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతులు నామినేషన్ వేయకుండా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఖండించారు. అధికారుల అత్యుత్సాహాన్ని ఎన్నికల కమిషన్ ముందు పెడుతామన్నారు. హుజూర్నగర్లో భాజపా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా అభ్యర్థిగా కోట రామరావు పేరును సిఫారసు చేశామని... రేపు నామినేషన్ దాఖలు చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు.