గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (22:37 IST)

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సత్యవతి ఆకస్మిక మృతి

kunja satyavathi
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి ఆకస్మిక మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడె జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు సోమవారం తెల్లవారుజామున అస్వస్థతకు లోనై తుదిశ్సావ విడిచారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సత్యవతి... గత 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 వరకు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు. 
 
ప్రస్తుతం భాజపా రాష్ట్ర నాయకురాలిగా ఉన్న ఆమె.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండనున్నట్లు ఊహగానాలు వెలువడ్డాయి. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. సత్యవతి భౌతికకాయానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నివాళులర్పించారు. ఆమె ఆకస్మికంగా మృతి చెందడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు.