సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: మంగళవారం, 8 మే 2018 (18:49 IST)

నీ ఉడత ఊపులకు భయపడం కేసీఆర్ : రేవంత్ రెడ్డి

మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి చంద్రబాబుతో ఇబ్బంది, నాతో కేసీఆర్‌కు ఇబ్బంది అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన

మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి చంద్రబాబుతో ఇబ్బంది, నాతో కేసీఆర్‌కు ఇబ్బంది అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసినందున తనపై కక్ష సాధింపునకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శంచారు. 
 
కేంద్రంలో తొలుత సీబీఐ, ఈడీలను పంపి.... తరవాత మోడీ, అమిత్‌ షాలు రంగంలోకి దిగుతారని, అలాగే రాష్ట్రంలో తొలుత ఏసీబీని ఉసిగొలిపి తరవాత కేసీఆర్‌ రంగంలోకి దిగుతారని ఆయన ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని విమర్శించారు.
 
మోడీ.. కేడీ కలిసి ఆడుతున్న నాటకమే నిన్నటి రివ్యూ' అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌.. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీ హబ్‌లో టెండర్లో అవినీతి జరిగింది అని కాగ్ నివేదిక ఇచ్చినా, నీ కుమారుడు నీతిమంతుడు అయితే ఎందుకు కేసును ఏసీబీకి అప్పగించవు. మోడీ తప్పులను ఎండగడుతున్న బాబుని నిలవరించే పనిలో భాగమే కేసీఆర్ సమీక్ష జరిగిందని అన్నారు. హత్యా రాజకీయాలు... ఉడుత ఊపులకు భయపడం అని తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి.