గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (09:16 IST)

కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో వ్యక్తి జంప్

Chain snatching
కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో ఓ వ్యక్తి జంప్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై స్నాచర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లోని ఓం శ్రీ సాయి నిలయంపై పోర్షన్ లో వెంకట యజ్ఞ కుమార్ అనే మహిళ వుంటోంది. 
 
ఒంటరిగా వున్న ఈ మహిళపై చైన్ స్నాచర్ దాడి చేశాడు.  కంట్లో స్ప్రే కొట్టి మెడలో వున్న బంగారు గొలుసును దోచుకెళ్లాడు. సమాచారం అందుకున్న క్రైమ్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంకా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.