మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (17:25 IST)

వనస్థలిపురం మరో ఇన్‌స్పెక్టర్‌ అక్రమ సంబంధం... అలా పట్టుకున్నారు..

lovers romance
మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరవక ముందే మరో ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలో ఇన్‌స్పెక్టర్‌ గా పని చేస్తున్న రాజు అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది.
 
అక్రమ సంబంధం పెట్టుకున్న యువతితో కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో సీఐని పోలీసులు పట్టుకున్నారు.  వనస్థలిపురంలో మహిళతో కారులో ఏకాంతంగా, మద్యం మత్తులో ఉన్న రాజు.. తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి పాల్పడ్డారు. 
 
అక్రమ సంబంధ పెట్టుకున్న మహిళతో పాటు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుల్స్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.