బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (09:52 IST)

ఆంధ్రజ్యోతి MDపై కేసు నమోదు: కారణం ఏంటంటే?

MD Radhakrishna
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐడీ సోదాల్లో భాగంగా వారి విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ మరికొందరితో పాటు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ పేర్కొంది. 
 
సీఐడీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ఆఫీసులో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తదుపరి విచారణ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఈ కేసును బదలాయించాలని తెలంగాణ పోలీసులను కోరింది.