1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (21:25 IST)

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఎన్వీ రమణ ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసే ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, తెలంగాణ సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలతో పాటు హైకోర్టు జారీచేసిన ఆదేశాలను అమలు చేయకుండా సోమేశ్ కుమార్ పెండింగ్‌లో పెండుతున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. కానీ, ఆ నిర్ణయాలను అమలు చేయకపోవడం వల్ల కోర్టుల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన అన్నారు.