ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:05 IST)

అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా రూ.500 కోట్లు: కేసీఆర్

kcrao
తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.
 
కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ ఆలయం కోసం రూ.100కోట్లు ప్రకటించిన కేసీఆర్.. మరో రూ.500 కోట్లు అదనంగా కేటాయించనున్నట్లు ప్రకటించారు.