బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (12:57 IST)

ఛాతీలో ఇన్ఫెక్షన్.. సీఎం కేసీఆర్ కోలుకునేందుకు టైమ్ పడుతుంది..

kcrao
కొద్దిరోజుల క్రితం వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని వివరించారు. దీంతో కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం వుందని తెలిపారు. 
 
వైరల్ జ్వరం బారిన పడిన సీఎం కేసీఆర్ దాదాపు మూడు వారాలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కేటీఆర్ వెల్లడించారు.