మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:52 IST)

నేడు నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్

kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వెళుతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహులు (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
గుురువారం ఎమ్మెల్యే చిరుమర్తి కుటుంబ సభ్యులు సంతాప సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో నార్కేట్‌పల్లికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.