బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:13 IST)

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్, సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రైతుల డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇవాల హైదరాబాదు ప్రగతి భవన్ ముట్టడి జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు.
 
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు.దీనికి తోడుగా రైతులకు రుణమాపీ చేయాలని అన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదన్నారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా సీతక్కను పోలీసులు అరెస్ట్ చేయడంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తనను అరెస్ట్ చేయడం పట్ల సీతక్క ట్విట్టర్లో మండిపడ్డారు. నేనేమైనా టెర్రరిస్టునా అంటూ ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు వెళితే అరెస్ట్ చేసారని ఆరోపించారు.