శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (13:40 IST)

వందేళ్లకోసారి కరోనా కంపనలు : కేసీఆర్

ప్రతి వందేళ్లకోసారి కరోనా వైరస్​ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. వందేళ్ల క్రితం ఈ మహమ్మారి బారిన పడి కోటీ 4 లక్షల మంది మరణించారని తెలిపారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో కరోనా వైరస్​ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, తక్షణ చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు.

ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కొవిడ్​-19 వైరస్​ నివారణకై తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించామని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. ఇప్పటికే దేశంలో 10 మందికి కరోనా నయమైందన్నారు. 65 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు.

దేశంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారన్నారు. చరిత్రలో కరోనా లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నారు. బయటి దేశాల నుంచి వస్తున్న వారిలోనే కరోనా వైరస్‌ గుర్తించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం, రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, మాల్స్‌ బంద్‌ చేశారన్నారు. ఉన్నతాధికారులతో హైలెవల్‌ కమిటీ మీటింగ్‌ జరుగుతోందన్నారు.