ఫుడ్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి: చేయగానే రూ. 70 వేలు మాయం
హైదరాబాదులో ఓ వ్యక్తి ఆన్ లైన్ మోసగాళ్ల దెబ్బకి రూ. 70 వేలు మోసపోయాడు. ఓ ఆన్లైన్ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఓ లింక్ పంపామనీ, ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటామని చెప్పారు.
వాళ్లు చెప్పిన విధంగానే అతడు ఆ లింక్ పైన క్లిక్ చేశాడు. అంతే.. క్షణాల్లో రూ. 70 వేలు అతడి ఖాతా నుంచి డెబిట్ అయిపోయాయి. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ కాగానే వెంటనే అతడు తనకు వచ్చిన ఫోన్ కాల్‌కి ఫోన్ చేసాడు. ఐతే మోసగాళ్లు ఫోన్ స్విచాఫ్ చేసేశారు. దీనితో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.