బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (10:12 IST)

కరోనాకు రూ. 45కే చికిత్స.. డెంగీకి రూ.450కే చికిత్స

Dengue
కరోనాకు రూ. 45కే చికిత్స అందించానని.. డెంగీకి ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స రూ.450కే అందిస్తానని సుల్తాన్‌బజార్ యూపీహెచ్‌లో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న వసంత్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) కనుక సహకరిస్తే డెంగీకి అత్యంత చౌకగా చికిత్స అందిస్తానని తెలిపారు. 
 
గతంలో తాను కరోనాకు అత్యుత్తమ చికిత్స అందించినట్టు గుర్తు చేశారు. డెంగీకి కేవలం రూ. 450కే చికిత్స అందించానని, ఒక్క రోజులోనే రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్ పెరిగినట్టు చెప్పారు.