బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (14:54 IST)

తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా : హైకోర్టు ప్రశ్న

తీన్మార్ మల్లన్నపై ఒకే ఒక్క కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేసిన న్యాయ స్థానం.. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. 
 
తెలంగాణలో మల్లన్నను అరెస్ట్ చేయాలన్న, మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరి అని చెప్పింది. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలన్న న్యాయస్థానం.. కేసు నమోదు చేసిన తర్వాత  41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని సూచించింది. 
 
మల్లన్నపై ఉన్న 35 కేసులపై వాదనలు వినిపించిన న్యాయవాది దిలీప్ సుంకర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మరోసారి వాదనలు వినిపించునున్నారు మల్లన్న తరుపు న్యాయవాది. ఇది తీన్మార్ మల్లన్నకు స్వల్ప ఊరట లభించినట్టే.