మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 నవంబరు 2019 (21:37 IST)

ప్రియాంకా రెడ్డి హత్య: స్కూటీ పార్క్ చేసిన స్థలంలోనే అత్యాచారం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఓవర్ బ్రిడ్జి కింద హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసు విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. ఆమెను దుండగులు ఎక్కడ హత్య చేశారన్నది పోలీసులు గుర్తించారు. ఆమె తన స్కూటీని ఎక్కడ పార్క్ చేశారో ఆ స్థలంలోనే ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్కూటీ పార్క్ చేసిన స్థలంలోనే ఆమె ఇన్నర్వేర్‌తో పాటు చెప్పులు పడి వున్నాయి.
 
కాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ తర్వాత హత్య చేసి ఓవర్ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి నిప్పంటించి వుంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగలు కర్నూలు హైవే మీదుగా పరారైనట్టు సిసి ఫుటేజ్‌ను బట్టి తెలిసినట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడింది లారీ డ్రైవర్లేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
 
మహిళా డాక్టర్ ప్రియాంకా రెడ్డి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన దుండగులు గుర్తు తెలియకుండా పెట్రోలు పోసి తగులబెట్టారు. పూర్తిగా తగులబడిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. నిన్నరాత్రి 9.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం స్కూటీ పంక్చర్ అయిందని ఎవరో ఓ వ్యక్తి చెప్పారు. ఆ స్కూటీని పంక్చర్ వేయించుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయాడతను. దాంతో ఆమె స్కూటీ కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఒంటరిగా నిలబడింది. ఈ విషయాన్ని ఆమె వెంటనే కుటుంబ సభ్యలకు సమాచారం అందించింది. 
 
అక్కడ లారీ డ్రైవర్లు వున్నారనీ, భయపడుతూ చెప్పింది. కొద్దిసేపటికే ఆమె ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా 28 తేదీ ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి మృతదేహం గుర్తుపట్టని విధంగా లభ్యమైంది.