శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (18:25 IST)

ప్రీతి ఆత్మహత్యకు ఆధారాలు చూపించారు - తండ్రి నరేందర్

medico preethi
తమ కుమార్తె డాక్టర్ ప్రీతి ధారావత్‌ది ఆత్మహత్య అని నిరూపించేలా ఆధారాలు చూపించారని మృతురాలి తండ్రి నరేందర్ తెలిపారు. ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రీతి ఆత్మహత్య కేసుపై పూర్తి నమ్మకం కలిగిందన్నారు. కేసుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదికపై వివరాలను సీపీని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. 
 
కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు నరేందర్‌ తెలిపారు. 'కేసుపై ఉన్న సందేహలను సీపీని అడిగి తెలుసుకున్నాను. ప్రీతిది ఆత్మహత్యే అని చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా చూపించారు. త్వరలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని చెప్పారు' అని ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియాకు వెల్లడించారు.
 
ప్రీతి మృతి కేసులో కీలకమైన పోస్టుమార్టం నివేదిక వివరాలను వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ శుక్రవారం వెల్లడించారు. గతంలో ప్రీతి రక్తనమూనాల్లో కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మృతిపై ఇన్నాళ్లూ స్పష్టత రాలేదు. 50 రోజుల తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యేనని పోలీసులు స్పష్టం చేశారు.