ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (19:25 IST)

కేవలం 11 రోజుల్లోనే టీఎస్‌ఆర్టీసీ రూ.25 కోట్లు

tsrtc
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సార్టీసీ) తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా కోసం రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. కేవలం 11 రోజుల్లోనే టీఎస్‌ఆర్టీసీ రూ.25 కోట్లు రాబట్టింది.
 
టీఎస్సార్టీసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు నగరంలోని పలు కేంద్రాలలో అక్టోబర్ 13 నుండి 25 వరకు రద్దీని నివారించడానికి 5265 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. 
 
అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 ప్రత్యేక బస్సులను నడిపి రూ.25 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.