ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (16:43 IST)

తెరాస ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్

nama nageswara rao
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. 
 
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మధుకాన్‌ గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్‌, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. 
 
రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరిట నామా నాగేశ్వరరావు రుణాలు తీసుకొని దారి మళ్లించారని ఈడీ ఆరోపించింది. సుమారు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామని పేర్కొంది. 
 
నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో గతంలో నామాకు చెందిన రూ.73.43కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే.