ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (11:29 IST)

వినాయకుడికి దీపం పెట్టారు.. ఆరిపోకూడదని దుప్పట్లు కట్టారు.. అంతే?

Lord vigneshwara
గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. 
 
దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 
 
గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైనాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.