బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (12:28 IST)

ముచ్చింతల్‌లో సమతా మూర్తి సదర్శనాలకు సెలవు

హైదరాబాద్ నగర శివారు ప్రాంతామైన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహ దర్శనానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు. శ్రీరామ నగరులోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, దర్శనానికి విరామం ప్రకటించడానికి గల కారణాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.
 
అయితే, ఏప్రిల్ 2వ తేదీ తెలుగు ఉగాది రోజు నుంచి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కాగా, సమతా మూర్తి బంగారు విగ్రహాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించిగా, అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ముచ్చింతల్‌లో నిత్యం భక్తులతో కళకళలాడుతోంది.