శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (06:00 IST)

'గ్రేటర్' కౌంటింగ్‌కు సర్వం సిద్ధం... 4న ఓట్ల లెక్కింపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ నెల 1వ తేదీన జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగ్యనగరి వాసులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైవుంది. ఈ ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. 
 
నగర పోలీసులు బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌లకు కట్టుదిట్టమైన భత్రను ఏర్పాటు చేశారు. టీఎస్ఎస్‌పీ, ఆర్డ్మ్ రిజర్డ్వ్, సివిల్ బలగాలను మూడు విభాగాలను మూడు రింగులలో ఏర్పాటు చేశారు.
 
పోలింగ్ ముగిసిన రోజు రాత్రే వీడియో చిత్రీకరణ చేస్తూ.. ఈ స్ట్రాంగ్ రూమ్‌లను సీజ్ చేశారు. నగర వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. పోలింగ్ కౌటింగ్ కేంద్రాలను సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేయగా, ఆ కేంద్రాలను పలు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.
 
నగర పౌరులు, కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే ఏజెంట్లు పోలీసులు ఏర్పాటు చేసిన ప్రాంతాలలోనే తమ వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుందని ఆంక్షలు విధించారు. ఈ కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్లతో పాటు ఎన్నికల అధికారులు జారీ చేసిన పాస్ ఉన్న వారు మాత్రమే రావాలని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు.