సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (18:06 IST)

ఇంత దారుణమా.. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.. కునుకు తీసిన సిబ్బంది!

జీహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదాపూర్, గచ్చిబౌలి, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న ఆసక్తి ఐటీ ఉద్యోగులకు ఉండడం లేదు. పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది.
 
అలాగే పాతబస్తీలో పోలింగ్‌ బూత్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాతబస్తీ అంతటా 25 శాతం పోలింగ్ మించలేదని అధికారులు అంటున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదు అయింది. పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. 
 
లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా బాగ్‌అంబర్‌పేట్ 64.82 శాతం, అత్తాపూర్ 54.95, బంజారాహిల్స్‌ 35.50, జూబ్లీహిల్స్‌ 30.08 శాతం, శేరిలింగంపల్లి సర్కిల్ 22.80, చందానగర్ సర్కిల్ 22.55 శాతం. కూకట్‌పల్లి సర్కిల్ 26.04, రామచంద్రాపురం సర్కిల్ 21.71 శాతం. రామచంద్రాపురం, పటాన్‌చెరు సర్కిల్ 51.71, అంబర్‌పేట్ సర్కిల్ 42.49 శాతం. ఉప్పల్ 37.01, 
 
ఎల్బీనగర్ 37.01, గాజులరామారం 36.65, అల్వాల్ 36.44 శాతం, రాజేంద్రనగర్ 35.45, హయత్‌నగర్ 34.79, చార్మినార్ 34.75 శాతం. మూసాపేట్ 34.25, ముషీరాబాద్ 32.93, మల్కాజ్‌గిరి 30.56, జూబ్లీహిల్స్ 30.45 శాతం నమోదు అయ్యందని అధికారులు చెప్తున్నారు.