శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:13 IST)

వేయిస్తంభాల గుడిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గల వేయిస్తంభాల గుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఓరుగల్లుకు తొలిసారిగా విచ్చేసిన గవర్నర్ తమిళిసై చారిత్రక కాకతీయ కట్టడాలను చూసి... పులకించిపోయారు. వేయిస్తంభాల గుడిని ఆసక్తిగా గమనించారు. శిల్ప సంపదతో అలరారిన దేవాలయం చుట్టూ కలియతిరిగారు.

రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం... హన్మకొండ వేయిస్తంభాల గుడికి విచ్చేసిన గవర్నర్ దంపతులు, రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

నందివిగ్రహం దగ్గర, ఆలయ పరిసరాల్లో చిత్రాలు దిగారు. గవర్నర్ రాకను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.