హైదరాబాదులో దారుణం: థాయ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని 23 ఏళ్ల థాయ్‌లాండ్ విద్యార్థి తనపై ఒక ప్రొఫెసర్ లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించింది.
వివరాల్లోకి వెళితే.. 69 ఏళ్ల ప్రొఫెసర్ తనను వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ థాయ్‌లాండ్ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్ తనను తన కార్యాలయానికి పిలిచి లైంగిక దాడికి ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది.
ఆమె ప్రతిఘటించడంతో నిందితులు తనను కొట్టారని ఆరోపించింది. ఆపై ప్రొఫెసర్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు గురి చేసింది.