హైక్లాస్ లేడిస్.. పేకాట ఆడుతూ దొరికిపోయారు..

woman
woman
సెల్వి| Last Updated: శనివారం, 31 అక్టోబరు 2020 (16:22 IST)
హైక్లాస్ లేడిస్ మందు తాగుతారు. ఆడుతారని వినివుంటాం. అయితే ఇక్కడ పేకాట ఆడే హైక్లాస్ లేడీస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో పేకటస్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని ఓ ఇంట్లో పలువురు ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

వీరంతా సంపన్న కుటుంబాలకు చెందిన డాక్టర్లు, న్యాయవాదులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి సెల్‌ఫోన్లతోపాటు 3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలో ఓ ఇంట్లో గుట్టుగా ఈ వ్యవహరం ఎప్పటి నుంచో నడుస్తున్నట్లు తెలుస్తుంది.దీనిపై మరింత చదవండి :