హుజూర్ నగర్ ఫలితాలు.. . కాంగ్రెస్ కంచుకోట బీటలు - కారు జోరు
తెలంగాణలో హుజూర్ నగర్‌కు ఉప ఎన్నికల జరిగింది. ఇక్కడ అధికార తెరాస గెలుపు ఖాయమని సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. కానీ కాంగ్రెస్ లేదా తెరాస ఏ పార్టీ అయినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతుందని భావిస్తున్నారు.
అయితే హుజూర్ నగర్‌లో ఓటమి దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీటును నిలబెట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ పాగా వేసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 19200 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.
మరోవైపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ నియోజకర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోను హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక జరిగింది.
ఈ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మిత్రపక్షం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. హర్యానాలో కూడా బీజేపీదేనని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే.