శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (10:11 IST)

#ElectionResults2019 హర్యానాలో బీజేపీని దెబ్బకొట్టిన జేజేపీ

హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ మరోమారు తిరిగి అధికారంలోకిరానుంది. అయితే, గతంలో కంటే ఈ దపా బీజేపీకి సీట్లు దక్కనున్నాయి. దీనికి కారణం.. ఎన్నికలకు ముందు కొత్తగా ఆవిర్భవించిన జేజేపీ పార్టీనే. మొత్తం 90 సీట్లు హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 43 సీట్లు, కాంగ్రెస్ 23, ఐఎన్ఎల్డీకి ఒకటి, జేజేపీకి 8 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 
 
ఈ ట్రెండ్ ఫలితాల సరళిని ప్రకారంగా అధికార బీజేపీ మరోమారు అధికారంలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 46 సీట్లు కావాల్సివుంది. అయితే, బీజేపీ మ్యాజిక్ మార్క్ వద్దే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేసమయంలో ఈ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులు పలువురు ఆధిక్యంలో ఉన్నారు. 
 
మరోవైపు, మహారాష్ట్రలో కూడా బీజేపీ మరో ఐదేళ్లూ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా బీజేపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై లేదని, తిరిగి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ముందుగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
 
ఇక, 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 167 చోట్ల, కాంగ్రెస్ 83 స్థానాల్లో ఎంఐఎం 2 చోట్ల, ఇతరులు 36 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా, ముస్లిం ఓట్లను చీల్చడంలో ఎంఐఎం అభ్యర్థులు తీవ్ర ప్రభావం చూపారు. ఫలితంగా కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి బాగా నష్టపోయింది.