గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (18:48 IST)

బేగంపేటలో ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు

electric bus tsrtc
హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో శుక్రవారం ప్రభుత్వం రవాణా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ బస్సు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. 
 
టీఎస్ఆర్టీసీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు బేగంపేట నుంచి ప్యారడైజ్‌కు వైపు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వెళుతుండగా జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లికపోయినా ఆస్తి నష్టం వాటిల్లింది. బస్సు ముందుభాగం స్వల్పంగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.