శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (18:02 IST)

హుజూర్‌నగర్‌పై కేసీఆర్ వరాల జల్లు

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఊహించని మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో.. నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.

ప్రతి గ్రామపంచాయతీకి రూ. 20 లక్షల నిధులిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఒక్కో మండల కేంద్రానికి రూ. 30 లక్షలు ఇస్తామని అలాగే.. రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు ఇస్తామని కేసీఆర్ ఈ సభాముఖంగా చెప్పారు.
 
‘ఈ విజయం మాలో ఉత్సాహాన్ని పెంచుతుంది. హుజూర్‌నగర్‌లో కల్వర్టులు నిర్మిస్తాం. సైదిరెడ్డి నాయకత్వంలోనే హుజూర్‌నగర్ అభివృద్ధి. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో సీఎం ప్రత్యేక నిధి నుంచి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేస్తాం.

నియోజకవర్గంలో బంజారాభవన్‌ను కూడా నిర్మిస్తాం. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోడుభూముల సమస్యను పరిష్కరిస్తాం. హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్‌ మంజూరు చేస్తాం. ఈఎస్‌ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్‌ కాలేజీని ఏర్పాటు చేస్తాం.

హుజూర్‌నగర్‌లో కోర్టును కూడా ఏర్పాటు చేస్తాం. భారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రతిపక్షాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాయి. 1997లో ఎన్టీఆర్‌ హయాంలో కరవు మంత్రిగా పనిచేశాను. నల్గొండ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.