శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By tj
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (12:33 IST)

ఆ విషయంలో కేసీఆర్‌ను మించిపోయిన కేటీఆర్...

గత రెండు నెలల కాలంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఆయన కుమారుడు కేటీఆర్‌నే ఎక్కువగా ప్రజలు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట. వేలల్లో కేసీఆర్‌ను సెర్చ్ చేస్తే కేటీఆర్‌ను మాత్రం లక్షల్లో సెర్చ్

గత రెండు నెలల కాలంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఆయన కుమారుడు కేటీఆర్‌నే ఎక్కువగా ప్రజలు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట. వేలల్లో కేసీఆర్‌ను సెర్చ్ చేస్తే కేటీఆర్‌ను మాత్రం లక్షల్లో సెర్చ్ చేస్తున్నారట. స్వయంగా ఈ విషయాన్ని గూగుల్ సంస్థే వెల్లడెంచింది. దేశంలో అత్యధికంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సెర్చ్ చేస్తున్న వారిలో కేటీఆర్ ఒకరట.
 
టాప్-10లో కేటీఆర్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపేందుకు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారు కేటీఆర్. తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలుగు ప్రజలు కేటీఆర్ ఏం చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆయన దినచర్యలను ఆసక్తిగా గమనిస్తున్నారట.