శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (14:17 IST)

కొల్లూరులో మహిళపై అఘాయిత్యం.. అత్యాచారం ఆపై హత్య

నిర్భయ, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నా.. చట్టాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం కొల్లూరులో లత అనే 28 ఏళ్ల మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు.

బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు బాధితురాలిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 
 
ముగ్గురు వ్యక్తులు మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.