గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (10:35 IST)

పెళ్ళీడుకొచ్చిన చెల్లిపై అన్నలు అత్యాచారం.. చెప్పినా పట్టించుకోని కన్నతల్లి!

పెళ్లీడుకొచ్చిన ఓ చెల్లిపై ఇద్దరు అన్నలు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రక్తం పంచుకుపుట్టిన అన్న కాగా, మరొకరు పెద్ద కుమారుడు. ఈ దారుణం కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. చిన్నప్పుడే నాన్న వదిలివెళ్లడంతో అమ్మ, చెల్లెలి (20)తో కలిసి ఉంటున్నాడు. చెల్లిపై కన్నేసి ఆమెను లోబర్చుకొని.. శారీరకంగా వాడుకోసాగాడు. 
 
అన్న అఘాయిత్యాల గురించి తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు, తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడా ఆమె కొడుకు నరకం చూపించాడు. అతను కూడా లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడసాగాడు. వీరిద్దరి హింసలను భరించలేని బాధితురాలు కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. 
 
ఇక గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పైగా, ఈ విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని బాధితురాలు వాపోతోంది. ఘటనపై బాధితురాలి సోదరుడు, ఆమెతల్లి, పెద్దమ్మ, ఆమె భర్త, కుమారుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.