శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (20:00 IST)

16 ఏళ్ల నుంచి మధుమేహం బాధపడుతున్నా.. మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తాను 16 ఏళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతున్నట్లు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఆరోగ్య తెలంగాణ కార్యాచరణ గురించి మీడియాతో మాట్లాడుతూ.. తాను గత 16 ఏళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో షుగర్ పరీక్షలు చేయించుకుంటే మధుమేహం ఉందని తెలిసిందని వివరించారు. అందుకే ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని, శరీర స్థితి పట్ల అప్రమత్తంగా ఉంటానని తన వ్యక్తిగత ఆరోగ్యం గురించి తెలిపారు. 
 
ఆరోగ్య తెలంగాణ గురించి చెబుతూ, రాష్ట్ర ప్రజలకు సంబంధించి బీపీ, షుగర్, కిడ్నీ, గుండె తదితర సమాచారంతో పాటు వ్యక్తులు ఎత్తు, బరువు వంటి అంశాలను కూడా ఆరోగ్య బృందాలు సేకరిస్తాయని వెల్లడించారు. 220 బృందాలు ఇంటింటికీ వచ్చి ఈ మేరకు పరీక్షలు చేసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారని కేటీఆర్ తెలిపారు.