కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి.. రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్ ను నియంత అంటున్నామని చెప్పారు.
కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందినప్పుడే రాష్ట్రం మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని అన్నారు. కౌరవులు వందమంది ఉన్నా పాండవులదే విజయమని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ దే విజయమని అన్నారు.
కలియుగ మహాభారతంలో కాంగ్రెస్ కు పదేళ్లు వనవాసమని, కానీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజగోపాల రెడ్డి అన్నారు. భట్టి శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు, జగ్గారెడ్డి భీముడు , శ్రీధర్ బాబు -ధర్మరాజు .. నకుల ,సహదేవులు సీతక్క ,పొదెం వీరయ్యలు అని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడమన్నదే తన లక్ష్యమని చెప్పారు.