మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జులై 2021 (14:32 IST)

చర్లపల్లి సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి జైలులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యాపేటకు చెందిన బానోతు శ్రీనుగా గుర్తించారు. 
 
జీవితకాల శిక్షపడిన ఖైదీ ఒకరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.