ఫోన్ ద్వారా పరిచయం.. పెళ్లైందని తెలిసి హతమార్చాడు
ఫోన్ ద్వారా పరిచయం. యువతిని ప్రేమించాడు. చివరికి ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ ఇది తెలుసుకున్న ఆమె అతనిపై అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపించింది. ఇది జరిగిన తర్వాత ఇద్దరు రాజీ పడి ఓ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
కానీ ఆమెను వదిలించుకోలేక అతని స్నేహితుడితో కలిసి తన భార్యను చంపాలని కుట్రపన్నాడు చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... యోగేష్‌కు 2020లో సీమ వైష్ణవతో ఫోన్ లో పరిచయమై శారీరకంగా దగ్గరయ్యారు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకునే సమయానికి సీమ విష్ణువుకు ముందే పెళ్లి అయిన విషయం తెలుసుకున్న యోగేష్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో సీమ వైష్ణవ, యోగేష్ పై అత్యాచార కేసు పెట్టి జైలుకు పంపింది.
జైలు నుండి తిరిగి వచ్చాక ఇద్దరు రాజీపడి గుడిలో పెళ్లి చేసుకున్నారు. యోగేష్ ఇంట్లో లేని సమయంలో తన భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. దీంతో యోగేష్ మిత్రుడైన రాజేష్‌తో కలిసి ఆమెను హతమార్చాడు. ఆపై చెరువులో పడేసి పారిపోయాడు.
ఈ నెల 9న పొన్నల్ ఎర్రకుంట చెరువులో చేపలు పట్టేందుకు వల వేసి ఉంచాడు. దీంతో వలలో చిక్కుకున్న మహిళ డెడ్ బాడీ నగ్నంగా ఉండడం, కాళ్ళు చేతులు కట్టి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఈ కేసును ఛేదించి నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.