గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (16:20 IST)

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ కన్నుమూత

పోలీసులను గడగడలాడించిన మావోయిస్టు అగ్రనేతల్లో హరిభూషణ్ ఒకరు. ఈయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. హరిభూషణ్ అనారోగ్యంతో కన్నుమూసినట్టు పోలీసు వర్గాల కథనం. ఈయన మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 
 
హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామం. ఆయన అసలు పేరు యాపా నారాయణ. కాగా, హరిభూషణ్ మృతిపై పోలీసులు మంగళవారం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
 
ఏజెన్సీ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడి ఉంటారని ఇటీవల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజేశ్, ఇడుమా, వినోద్ వంటి మావోలు కరోనాతో బాధపడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోలు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల ప్రకటించారు.