మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (20:35 IST)

భార్య కోసం భర్త వెతుకుతుంటే.. ఆమె వేరొక యువకుడి బైక్‌పై రయ్‌మంటూ పరార్!

భార్య కిడ్నాప్ అయ్యిందని ఆ భర్త ఎక్కడెక్కడో వెతికాడు. కానీ అసలు విషయం తెలుసుకుని షాకయ్యాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనతో ఆ భర్త షాక్ తిన్నాడు. వాటర్ బాటిల్ కోసం అంటూ బయటకు వచ్చిన భార్య కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకి కోసం వెతికిన భర్త అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో భార్యను చూసి కంగుతిన్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రభుదాస్, రమ్య దంపతులు. వీరికి రెండెళ్ళ కుమారుడు ప్రకాశ్ ఉన్నాడు. వీరు ముగ్గురు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి జోథ్‌పూర్ వెళ్లే క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైల్లో బయలు దేరడానికి ముందు వాటర్ బాటిల్ కోసం అంటూ భార్య రమ్య తన కొడుకు ప్రకాష్‌ను తీసుకొని స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. 
 
ఎంతకి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. ఎదో జరిగిందని భావించి వెతుక్కుంటూ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా భార్య, కొడుకు జాడ కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వారిని వాకబు చేయగా.. ఒక మహిళ మాత్రం పరుగులు పెడుతూ వచ్చి బైక్ ఎక్కి వెళ్ళిందని స్థానికులు చెప్పారు.
 
అనుమానం వచ్చి అధికారులను సంప్రదించగా వారు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూపించారు. అందులో షాక్ గురయ్యే దృశ్యాలు బయట పడ్డాయి. అతని భార్య, పిల్లాడు కలిసి మరో యువకుడి బైక్‌పై రయ్యిమని వెళ్ళిపోయారు. దీంతో వెంటనే భర్త ప్రభుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పారిపోయిన భార్య కోసం వెతుకుతున్నారు.