శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (18:47 IST)

కింగ్ కోఠిలో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డు సజీవ దహనం

fire
హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. 
 
ఈ క్రమంలో వినాయక్ మెకానిక్ షెడ్డులో వ్యాపించిన మంటల్లో నిద్రిస్తున్న కారులో వున్న సెక్యూరిటీ గార్డు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయాల పాలైనారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా, నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశామని తెలిపారు.