గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (23:27 IST)

తెలంగాణ మళ్లీ తొంగిచూసిన కరోనా.. 24 గంటల్లో 83 కేసులు

corona visus
తెలంగాణలో కరోనా మళ్లీ తొంగిచూసింది. కరోనా కనుమరుగైందని అందరూ ఊపిరి పీల్చుకుంటూ., వారి వారి పనుల్లో బిజీబిజీగా వున్న సమయంలో తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా ప్రజల్లో ఆందోళనలు తప్పట్లేదు. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 8వేల 809 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 45 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, మెదక్ జిల్లాలో 5 కేసులు, కరీంనగర్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.
 
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.