దేశంలో స్థిరంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అయితే, కొవిడ్ బారిన పడి 35 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,555 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,45,34,188 మంది ఈ వైరస్ సోకింది. వీరిలో 5,28,337 మంది చనిపోయారు. ప్రస్తుతం 47,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, శనివారం 14,84,216 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 216.56 కోట్లకు చేరింది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,38,128 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 774 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,68,56,201 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,30,060 మంది మరణించారు. మరో 5,94,451 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,62,84,233కు చేరింది.
జపాన్‌లో కొత్తగా 77,804 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 186 మంది ప్రాణాలు కోల్పోయారు.రష్యాలో కొత్తగా 58,305 కేసులు వెలుగుచూశాయి. మరో 107 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 43,400 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 57 మంది మృతి చెందారు.తైవాన్‌లో 39,628 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు.ఫ్రాన్స్‌లో 33,162 కొత్త కేసులు నమోదయ్యాయి.