శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 22 జులై 2021 (07:38 IST)

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికోసం రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సమీపంలో స్థలాన్ని కూడా కంపెనీ ఎంచుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మరో 3 నెలలు పట్టే అవకాశం ఉంది.
 
మైక్రోసా్‌ఫ్టకు ఇప్పటికే హైదరాబాద్‌లో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఉంది. భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్‌ జియోతో మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపిన సంగతి తెలిసిందే.  కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్‌ వంటి కొత్తతరం టెక్నాలజీల వినియోగం పెరగడంతో డేటా సెంటర్ల ఏర్పాటు కంపెనీలకు కీలకంగా మారింది.

వీటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు భారత్‌లో అందుబాటులో ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి.  డేటాను స్థానికంగానే ఉంచాలన్న నిబంధన కూడా అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా కేంద్రాలను ఏర్పాటుచేయడానికి ఊతమిస్తోంది.