గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (13:31 IST)

కేసీఆర్ సూట్ కేసుల్లో హుజూరాబాద్‌కు కోట్లు పంపిస్తున్నారు.. కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వుండేది ఇక రెండేళ్లేనని జోస్యం చెప్పారు. కేసీఆర్ సూట్‌కేసుల్లో హుజూరాబాద్‌కు కోట్లు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
కేసీఅర్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కోట్లు ఖర్చుచేసినా హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర యాదాద్రి జిల్లా భువనగిరిలో కొనసాగింది. భువనగిరిలో గిరిజన మహిళా కార్యకర్తలతో కలిసి బైక్ రైడ్ చేశారు మంత్రి కిషన్ రెడ్డి.
 
భువనగిరి పట్టణంలోని ఓ రేషన్ షాప్‌ను ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పేదలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కుటుంబ, నియంత పార్టీ టీఆర్ఎస్ పాలనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రజలు నిజాం పాలన, ఎఐఎం తొత్తుగా ఉన్న టీఆర్ఎస్ ను బుద్ధి చెప్తారని అన్నారు. 
 
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. తొలిసారిగా మోదీ మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత పాటించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్న ఆయన.. భవిష్యత్తులో ఇద్దరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినా టీఆర్ఎస్‌లోనే చేరుతారని జోస్యం చెప్పారు.