శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (12:23 IST)

ఎండ్రిన్ గుళికలను టీ పోడిగా భావించి వేసింది.. అంతే మహిళ మృతి

ఓ టీ మహిళ ప్రాణం తీసింది. ఉదయం టీ తాగతుండగా ఆ మహిళ ప్రాణం పోయింది. ఈ ఘటన బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం నెలకొంది. విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
అంజమ్మ అనే మహిళ ఇవాళ ఉదయం టీ తయారు చేస్తున్న సందర్భంగా.. ఎండ్రిన్ గుళికలను టీ పోడిగా భావించి అందులో వేసింది. ఆ టీ సేవించిన కాసేపటికే అంజమ్మ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.