ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (11:59 IST)

వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలు

Rains
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు పలకరించనున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా.. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో కూడా రుతుపవనాల ప్రభావం కనిపించనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 
 
ఈ రుతుపవనాల ప్రభావంతో.. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.