సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (10:07 IST)

భర్తతో ఆటోలో వెళ్తున్న నవవధువును ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?

marriage
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం నవ వధువును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహిళ భర్తపై దాడి చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది.
 
ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న నవీన్ అలియాస్ సన్నీ, మాధవి ఆటో రిక్షాలో వెళ్తుండగా కారులో కొందరు దుండగులు నవీన్‌ను కొట్టి మాధవిని కారులో తీసుకెళ్లారు. కులాంతర వివాహం కావడంతో వివాహాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు తన భార్యను కిడ్నాప్ చేశారని నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఎంబీఏ చేస్తున్న మాధవి ప్రాజెక్ట్ వర్క్ కోసం తన భర్తతో కలిసి కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్న భోజనానికి ఆటో రిక్షాలో వెళ్తుండగా కిడ్నాపర్లు అడ్డంగా దొరికిపోయారు. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.